ప్రతి ఒక్కరూ తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తాము అందంగా కనిపించడానికి రకరకాల క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు. అందులో ఒకటి ముల్తానీ మట్టి . ఈ ముల్తానీ మట్టిని రాయటం వల్ల మీ ముఖం కూడా అందంగా మారుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తాని మట్టి ఎంతో చక్కగా పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేయడంలో ముల్తాని ఫేస్ ప్యాక్ ని మీకోసం తీసుకొచ్చాం. మరి ఆ ప్యాక్ ఏమిటో... ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో కొద్దిగా ముల్తాని మట్టి, ఒక స్పూన్ శనగపిండి, పాలు, పెరుగు కొద్దిగా వేసి మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి, మెడకు పట్టించి ఓ పావుగంటసేపు అలానే ఉంచాలి.

ఆ తర్వాత కడిగేయాలి.ఇలా తరచూ చేస్తే ముఖం క్లీన్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. కాబట్టి మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ని తప్పకుండా ట్రై చేయండి. ముల్తాని మట్టి సహజమైన చర్మ సంరక్షణ ఉత్పత్తిగా ప్రసిద్ధి. ఇది చర్మాన్ని శుభ్రపరచడం, తొలగించడం, మొటిమలను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్తాని మట్టి ఉపయోగించి చర్మ సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చు. ముల్తాని మట్టిలో ఆయిల్ అబ్జార్బింగ్ ప్రాపర్టీస్ ఉండటంతో అతిగా చర్మం మీద పేరుకున్న నూనె, ధూళి, మృతకణాలను తొలగిస్తుంది,

 ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.చెంచా ముల్తాని మట్టి + 1 చెంచా గులాబి నీరు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.వారంలో 2-3 సార్లు చేయడం మంచిది.పొడిచర్మానికి తేమ అందించడానికి పెరుగు లేదా తేనెతో కలిపి ముల్తాని మట్టిని ఉపయోగిస్తే, పొడిచర్మానికి తేమ అందుతుంది.చెంచా ముల్తాని మట్టి + 1 చెంచా తేనె + 1 చెంచా పాలు కలిపి పేస్టుగా చేసి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు. ముల్తాని మట్టిలోని ఖనిజాలు & కూలింగ్ ప్రాపర్టీస్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.15 నిమిషాల తర్వాత కడిగేయాలి.ట్యాన్ చర్మం ముదురుదనం తగ్గించడానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: