అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. పాలలో కాల్షియం కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అరటిపండులో మెగ్నీషియం ఉండటం వల్ల కండరాలు సడలవుతాయి మరియు నిద్ర బాగా వస్తుంది.మరీ బక్కగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలలో ఒక అరటిపండును వేసుకుని తింటే బరువు పెరుగుతారు. దీనికోసం ఒక గ్లాసు పాలలో అరటిపండు, తేనె, డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
పాలు, అరటిపండు కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. పాలు, అరటిపండు కలిపి తింటే అనేక రకాల సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఈ రెండు కలిపి తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పాలల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీంతో గట్ హల్త్ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది కండరాల తిమ్మిర్లు నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పాలల్లో ప్రోటీన్ కండరాలని ఆరోగ్యంగా బలంగా మారుస్తుంది. కాబట్టి ఈ రెండిటిని కలిపి తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు ఈ రెండిటిని కలిపి తినటం మంచిది.