![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/lifestyle/taurus_taurus/cholesterol-prevent-heart-diseases--increased--health29174826-2073-4ef1-b082-60fed5621631-415x250.jpg)
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం – ఓట్స్, గోధుమ రొట్టి, పండ్లు, కూరగాయలు, పప్పులు. కొవ్వు పెరగకుండా ఉండేందుకు బదులుగా ఆరోగ్యకరమైన కొవ్వులు – ఆలివ్ ఆయిల్, నాటు వేరుసెనగ నూనె వంటివి వాడాలి. నిత్యం కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేయండి – నడక, జాగింగ్, సైక్లింగ్, ఈరోబిక్స్ లాంటి శారీరక కార్యకలాపాలు బాగా ఉపయోగపడతాయి.యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడం. పొగతాగడం హై డెన్సిటీ లైపోప్రోటీన్ (HDL – మంచి కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గించి, గుండె జబ్బులకు కారణమవుతుంది. మద్యం తక్కువగా తీసుకోవడం.
అధిక మద్యం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచడం. అధిక బరువు గుండెకు భారం కలిగించి, కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. డయాబెటిస్, హై బీపీ నియంత్రణలో ఉంచుకోవడం. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు వాటిని నియంత్రించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఆరోగ్య పరీక్షలు నిత్యం చేయించుకోవడం. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ – కొలెస్ట్రాల్ స్థాయులను తెలుసుకోవడానికి తక్కువలో తక్కువ సంవత్సరం లో ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) లేదా 2D-ECHO – గుండె ఆరోగ్యాన్ని రాబోయే ప్రమాదాల నుండి కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి.