జుట్టుకి ఉల్లిపాయ రసం రాస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు పెరగటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ ఉల్లిపాయ రసాన్ని రాస్తే వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది. ఉల్లి రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది కులాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు బాగా ఎదగడానికి సహాయపడుతుంది. జుట్టు దృఢంగా కూడా మారుతుంది. యాంటీ ఇంఫ్లమేటరి గుణాలు ఉల్లి రసంలో ఉంటాయి. ఈ రసాన్ని తలకు ఉపయోగించడం వల్ల కుదుళ్ళలో మంట, దురద లాంటి సమస్యలు ఉండవు. ఉల్లి రసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, చుండ్రు వంటి సమస్యలకు దూరంగా ఉండడానికి అవుతుంది.

ఈ రసాన్ని తలకు రాస్తే జుట్టు మృదువుగా కూడా ఉంటుంది. ఉల్లి రసం రెగ్యులర్గా అప్లై చేయడం ద్వారా వెంట్రుకలకు నిగారింపు వస్తుంది. నల్లగా మెరిసేలా మారతాయి. జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకోండి. ఆ తరువాత స్ట్రెయిన్ చేసి రసాన్ని తలకు ఉపయోగించాలి. ఈ రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు సహాయపడే శక్తివంతమైన సహజ నివారణా మార్గం. ఇది సల్ఫర్ సమృద్ధిగా ఉండటంవల్ల జుట్టు ఊడిపోకుండా, కొత్త జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ రసం తయారీ. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీ లేదా గ్రైండర్‌లో గ్రైండ్ చేసి, గట్టి ముస్లిన్ క్లాత్ లేదా స్ట్రైనర్‌తో రసం వడగట్టుకోవాలి.

ఉల్లిపాయ రసం + కొబ్బరి నూనె. 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేయాలి. 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇది జుట్టు మృదువుగా, పొడిబారకుండా ఉంచుతుంది. ఉల్లిపాయ రసం + అలోవెరా జెల్.టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసానికి 1 టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్ కలపాలి. తలపై రాసి 30 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది తలకు తేమను అందించి, చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసానికి 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తలకు మర్దన చేయాలి. ఇది తలతురిచిని తగ్గించి, ఆరోగ్యవంతమైన జుట్టును అందిస్తుంది. వారం లో 2-3 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రసం వేసిన తర్వాత కొద్దిగా మంట లేదా చిరాకు అనిపిస్తే వెంటనే కడిగేయాలి. బలమైన వాసన తట్టుకోలేకపోతే, రసం వాడిన తర్వాత లెమన్ జ్యూస్ కలిపిన నీటితో తల కడగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: