చాలామంది కొబ్బరి నీళ్లు తాగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్ళు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రాటెడ్ గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సహాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుండి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చెయ్యలేరు.

ఇది హైపర్కలేమియా కు దారితీస్తుంది. దీనివల్ల కండరా బలహీనత, క్రమ రహిత హృదయ స్పందన, తీరమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదే అయినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు దీనిని తాగకుండా ఉండటం మంచిది. కిడ్నీ సమస్యలున్నవారు – కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో, కిడ్నీ ఫెయిల్యూర్ లేదా హైపర్‌కలేమియా ఉన్నవారు తాగడం మానుకోవాలి.లో బ్లడ్ ప్రెజర్ (Low BP) ఉన్నవారు – ఇది రక్తపోటును తగ్గించే లక్షణాలు కలిగి ఉండటంతో, ఇప్పటికే లో బిపి ఉన్నవారికి ప్రమాదకరం కావొచ్చు. ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నవారు – కొబ్బరి నీళ్లు రక్తపోటును ప్రభావితం చేయవచ్చు కాబట్టి, సర్జరీ ముందు లేదా వెంటనే తాగడం మంచిది కాదు.

ఆలర్జీ ఉన్నవారు – కొబ్బరిలోని ప్రోటీన్స్ వల్ల కొందరికి అలర్జీ రియాక్షన్ రావొచ్చు, ముఖ్యంగా నట్ అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు (అతి ఎక్కువగా తాగితే) – కొబ్బరి నీళ్లలో సహజంగా చక్కెరలూ ఉండటం వల్ల, డయాబెటిస్ ఉన్నవారు అధికంగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. డయరియా  ఉన్నవారు – కొబ్బరి నీళ్లు సహజ విసర్జక గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పటికే డయరియా ఉన్నవారు దీన్ని తాగితే మరింత తీవ్రమవుతాయి. పరిమితంగా తాగితే మంచిదే, కానీ రోజుకు 1-2 గ్లాసుల కంటే ఎక్కువ తాగడం అవసరం లేదు. దుబారా చేసిన లేదా చక్కెర, రసాయనాలు కలిపిన కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: