
స్నానం చేయడం లేదా వెచ్చని నీళ్లతో కాలుకి మసాజ్ చేయండి.వెచ్చని నీటితో స్నానం చేస్తే నిద్ర నాణ్యత మెరుగవుతుంది, ఇది మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. కాలుకి నూనె మర్దన చేయడం నరాలను రిలాక్స్ చేసి హార్మోన్ల బ్యాలెన్స్‌ను మెరుగుపరచుతుంది. ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ ఉపయోగించడాన్ని నిద్రకు 30 నిమిషాల ముందు ఆపేయండి. బ్లూ లైట్ మెటాబాలిజాన్ని నెమ్మదింపజేసి కొవ్వు గూడడానికి కారణం కావచ్చు. రోజూ 5-10 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా మెడిటేషన్ చేయడం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఇది స్ట్రెస్ తగ్గించి కార్టిసోల్ లెవెల్స్ (స్ట్రెస్ హార్మోన్) నియంత్రణలో ఉంచుతుంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాస్ వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే, కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. రాత్రి 7-8 గంటల తర్వాత ఆహారం తీసుకోకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వరకు ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చీకటి గదిలో నిద్రపోవడం మెటాబాలిజాన్ని మెరుగుపరిచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నిద్రకు ముందు అధిక కార్బోహైడ్రేట్లు & ప్రాసెస్ చేసిన ఆహారం తినొద్దు. ఆల్కహాల్ & గ్యాస్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోకూడదు.