రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఐరన్, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న పండ్లు తినడం చాలా అవసరం. ఈ పోషకాలు రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అనారలో ఐరన్, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.ద్రాక్షలో రక్త శుద్ధికి, కొత్త రక్త కణాల తయారికి ద్రాక్ష చాలా మేలైనది. ఎర్ర ద్రాక్షలో ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సీతాఫలములో ఐరన్, విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రక్త హీనత తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది రక్తనాళాలను శక్తివంతంగా మార్చి మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇవి విటమిన్ C అధికంగా కలిగి ఉంటాయి, ఇది ఐరన్ శరీరంలో మెరుగైన శోషణకు సహాయపడుతుంది. రోజూ ఒక నారింజ లేదా నిమ్మకాయ రసం తాగితే రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు మంచిది మరియు రక్త శుద్ధికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్ పెంచటానికి సహాయపడుతుంది.

రోజుకు 2-3 ఖర్జూరాలు తినడం రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రక్తంలో ఐరన్ శోషణను పెంచుతుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఐరన్‌ను శరీరంలో చక్కగా గ్రహించుకునేలా చేస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం + విటమిన్ C ఉన్న ఆహారం తీసుకోవాలి (ఐరన్ శోషణ మెరుగవుతుంది) ఉదయం ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత ఈ పండ్లను తినడం మంచిది. పాలతొ కాకుండా నిమ్మరసం లేదా కమలాఫలంతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: