బాదం తేనె కలిపి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఉన్నాయి. ఈ మిశ్రమం రోజూ తింటే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెదడు శక్తి పెరుగుతుంది. బాదం & తేనెల్లో ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ E, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి ముఖ్యత: పిల్లలు, విద్యార్థులు & పెద్దలకు మెమరీ పవర్ పెంచేందుకు ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిపెరుగుతుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ & యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

బాదంలో జింక్, విటమిన్ E, సెలీనియం ఉండటంతో ఇన్ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెలో నేచురల్ ఎంజైమ్స్ ఉండటంతో అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. బాదంలో ఫైబర్ అధికంగా ఉండటంతో కడుపు సమస్యలు తగ్గి, మంచి జీర్ణక్రియ పొందవచ్చు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాదంలో ప్రోటీన్ & ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తూ, అధిక ఆకలిని నివారిస్తుంది. తేనె మెటాబాలిజాన్ని పెంచి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

విటమిన్ E & యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఊడకుండా, ఒత్తుగా & పొడిగా కాకుండా బలంగా మారుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.బాదం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె జబ్బుల రిస్క్ తగ్గిస్తుంది.తేనె హై బీపీ & బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శక్తిని పెంచే నేచురల్ ఎనర్జీ బూస్టర్. తేనె తక్షణ శక్తిని ఇస్తుంది, బాదం నెల్లంతా ఎనర్జీ లెవల్స్ స్టేబుల్‌గా ఉంచుతుంది. రాత్రి 5-6 బాదం నీటిలో నానబెట్టి, ఉదయం తొక్క తొలగించి తేనెతో కలిపి తినాలి. వేడిగా కాకుండా గోరు వెచ్చని పాలతో తింటే ఇంకా మంచిది. రోజుకు 1 టేబుల్ స్పూన్ తేనె మించకుండా తినాలి (డయాబెటిస్ ఉన్నవారు తేనె పరిమితంగా తీసుకోవాలి).

మరింత సమాచారం తెలుసుకోండి: