
ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతుంది. హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్‌ల రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. చర్మానికి కాంతి తీసుకొస్తుంది.యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలు, ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గే ప్రయత్నంలో సహాయపడుతుంది. లో-కేలరీ & హై-ఫైబర్ ఫ్రూట్ కావడంతో ఇది త్వరగా హజమ్ అవుతుంది, ఎక్కువ కాలం ఆకలి వేయకుండా ఉంటుంది.
బరువు తగ్గే వారు స్మూతీలలో ఈ పండును కలుపుకోవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.కిడ్నీ మరియు కాలేయాన్ని డిటాక్స్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు & హై వాటర్ కంటెంట్ వల్ల కిడ్నీలను, కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి ఇది సహాయపడుతుంది. బీటా-సయానిన్ ఫ్లేవనాయిడ్స్ వంటి పదార్థాలు కేన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి.