మనుషులు జంతువులు ఇలా ప్రతి జీవి కూడా చీకటి పడగానే హాయిగా నిద్రపోవాలని అనుకుంటారు. అయితే జంతువులు మంచిగానే నిద్రపోతున్నాయి కానీ నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది మనుషులు మాత్రం రాత్రిపూట లైట్లు వేసుకుని నిద్రపోతున్నారు. ఇది సాధారణ అలవాటుగానే అనిపించవచ్చు, కానీ దీని వెనుక దాగి ఉన్న ముప్పు తెలిస్తే మాత్రం మీరు షాక్ అవ్వక తప్పదు. నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం, రాత్రిపూట వెలుతురులో నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

చీకటిలో ప్రశాంతంగా నిద్రించేవారి కన్నా, వెలుతురులో నిద్రించేవారికి ఊబకాయం వచ్చే రిస్క్ చాలా ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, మీ మానసిక ఆరోగ్యం కూడా చిన్నాభిన్నం అయ్యే ఛాన్సులు ఉన్నాయట. నిద్రలేమి, చిరాకు, నిరంతరం ఏదో తెలియని ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది.

ఇంకో డేంజర్ ఏంటో తెలుసా? మీ రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి, మధుమేహం మీ దరికి చేరే అవకాశం ఉంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలు కూడా వెన్నంటే వచ్చేస్తాయి. రాత్రిపూట లైట్ వెలుతురులో నిద్రపోవడం వల్ల మీ శరీరం సహజంగా ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ నిద్రను ప్రోత్సహించడమే కాకుండా, శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది.

కాబట్టి, ఇప్పటినుంచైనా మేల్కోండి. రాత్రిపూట నిద్రించే ముందు లైట్లన్నిటినీ ఆర్పివేయండి. మీ పడకగదిని చీకటిగా, ప్రశాంతంగా మార్చుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చీకటి నిద్ర ఎంతో అవసరం. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీయొచ్చు. ఇకపై లైట్ వేసుకుని పడుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ లైట్ వేసుకోవాలి పడుకోవాల్సి వస్తే తలెత్తే రిస్కులను తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించండి. లేదంటే తెలిసి మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: