పాములకు, ముంగిసలకు మధ్య పోట్లాట అంటే ఎప్పటినుంచో అందరికీ చాలా ఆసక్తి ఉంది. మన భారత ఉపఖండంలో ఈ రెండిటి యుద్ధాల గురించి ఎన్నో కథలు, పురాణాలు ఉన్నాయి. కానీ అసలు ఈ వైరం నిజంగా ఉందా, ఒకవేళ పాము కాటేస్తే ముంగిస బతుకుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

ముంగిస పిల్లల్ని పాములు తినేస్తాయంట. అందుకే పాములు కనిపిస్తే చాలు, తల్లి ముంగిసలు వాటి మీద పడిపోతాయి. పిల్లల్ని కాపాడుకోవడానికి ఇలా చేయక వాటికి తప్పడం లేదు. ఐతే అన్ని పాములు ముంగిసల్ని తినవు. కొండచిలువల్లాంటి పెద్ద పాములు మాత్రమే ముంగిసల్ని మింగగలవు. మిగతా పాములు ఏమో బల్లులు, కప్పలు, ఎలుకల్ని లాగిచ్చేస్తాయి.

మరోవైపు ముంగిసలు మాత్రం పాములకు పెద్ద డేంజర్. అవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి, పైగా చాలా దూకుడుగా ఉంటాయి. అంతేకాదు, వేటాడటంలో కూడా మహా దిట్టలు. అందుకే దగ్గరలో పాములు కనిపిస్తే అంతే సంగతులు, వేటాడి మరీ చంపేస్తాయి.

డాక్టర్ రష్మీ శర్మ బీబీసీతో మాట్లాడుతూ"స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఇండియన్ ముంగూస్" అనే రీసెర్చ్ పేపర్లో ముంగిసల గురించి చాలా విషయాలు చెప్పారు. ముంగిసలు గుంపులుగా బతుకుతాయంట. ఒక్కో గుంపులో 6 నుంచి 40 వరకు ముంగిసలు ఉంటాయి. ఆ గుంపునకు ఒక లీడర్ ఉంటుంది, అది మగ ముంగిస అయినా, ఆడ ముంగిస అయినా స్ట్రాంగ్ గా ఉండాలంతే. ఒక్కో ముంగిసకు ఒక్కో పని ఉంటుంది. కొన్ని ముంగిసలు డేంజర్ ఉందా అని కాపలా కాస్తుంటాయి. వాటికి వాసన, వినికిడి, చూపు అన్నీ సూపర్ షార్ప్ గా ఉంటాయి. అందుకే వేటలో వాటిని కొట్టేవాళ్లే ఉండరు.

బీబీసీ వైల్డ్ లైఫ్ చెప్పిన ప్రకారం కొన్ని రకాల ముంగిసలు విషపూరిత పాము కాటును కూడా తట్టుకోగలవు. పాము విషంలో ఆల్ఫా-న్యూరోటాక్సిన్ అనే పవర్ఫుల్ టాక్సిన్ ఉంటుంది. ఇది నరాల సిగ్నల్స్ ని బ్లాక్ చేసి మనిషిని గానీ, జంతువును గానీ పడగొట్టేస్తుంది. కానీ ముంగిసలకు మాత్రం ఒక స్పెషల్ పవర్ ఉంది. వాటి బాడీలో స్పెషల్ ఎసిటైల్‌కోలిన్ రిసెప్టర్స్ ఉంటాయంట. ఇవి విషం వల్ల నర్వస్ సిస్టమ్ షట్ డౌన్ అవ్వకుండా కాపాడతాయి. అందుకే పాము కాటేసినా కొన్నిసార్లు ముంగిసలు బతికేస్తాయి.

అయితే పూర్తిగా ఇమ్యూనిటీ ఉందని కాదు. మరీ పెద్ద పాము లేదా ఎక్కువ విషం ఉన్న పాము కరిస్తే, ముంగిస కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉంది.

చిన్న ముంగిసలైనా, కొత్తగా వేట నేర్చుకుంటున్న ముంగిసలైనా పాముల్ని ఓడించగలవు. వాటి దెబ్బలు అంత పవర్ఫుల్ గా ఉంటాయి. మెయిన్ గా పాము తల మీద గట్టిగా కొరుకుతాయి. ఒక్కోసారి ఆ దెబ్బకు పాము అక్కడికక్కడే చచ్చిపోతుంది. అందుకే పాముల జనాభాను కంట్రోల్ చేయడంలో ముంగిసలు సూపర్ ఎఫెక్టివ్.

ఐతే ముంగిసలు ఎప్పుడూ కోబ్రాల్లాంటి బాగా విషం ఉన్న పాముల జోలికి మాత్రం పోవు. పైగా వాటికి కోబ్రా మాంసం అంటే కూడా అంత ఇష్టం ఉండదంట.

బ్రిటానికా ప్రకారం ముంగిసలు ఆఫ్రికా, దక్షిణ ఆసియా, దక్షిణ యూరప్ లలో కనిపిస్తాయి. బొరియల్లో, చెట్ల తొర్రల్లో నివసిస్తాయి. చిన్న జంతువులు, పక్షులు, సరీసృపాలు, గుడ్లు, పండ్లు అన్నీ లాగిస్తాయి. మన ఇండియాలో ఇండియన్ గ్రే ముంగూస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చారల ముంగిస, పొడవాటి తోక ముంగిస, ఆఫ్రికాలో కంగారూ ముంగిస లాంటి రకాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: