
జీర్ణ వ్యవస్థ శుభ్రం – లవంగాల్లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. టాక్సిన్లు తొలగించడం – లవంగాలు లివర్‌ను డిటాక్సిఫై చేయడానికి సహాయపడతాయి, తద్వారా శరీరం లోపల నుండి శుభ్రం అవుతుంది. బాక్టీరియా మరియు వైరస్‌లపై పోరాటం ,లవంగాల్లో యూజెనాల్ అనే పదార్థం ఉండటంతో, ఇది శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణ ,లవంగాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి.
వాయువును తగ్గించడం – గ్యాస్, వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యం – దగ్గు, ముక్కు బంధం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలు టీ తయారీ విధానం. 1 లేదా 2 లవంగాలు తీసుకుని, వాటిని కొద్దిగా ముద్దగా చేస్తారు.1 కప్పు నీటిని మరిగించి, అందులో లవంగాలను వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. తరువాత, దాన్ని వడపోసి తాగాలి. రుచికి తేనె లేదా లెమన్ జ్యూస్ కలుపుకోవచ్చు. ఎంతవరకు తాగడం మంచిది? రోజుకు ఒకసారి తాగడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీలు లేదా ఏదైనా మెడికల్ కండిషన్ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తాగడం మంచిది.