ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ప్రతి ఒక్కరికి డయాబెటిస్ సమస్య వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి బాధితులే. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే. త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాల్లో మరో 15% ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే సాంబ మసూరి వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని చెబుతున్నారు. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడి నిచ్చే 'మిరాకిల్ రైస్' వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆగల్ని తీర్చిన 'ఇరి' ఇప్పుడు షుగర్ పెంచిని,

ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. తెల్ల బియ్యం తినడం మరియు షుగర్ స్థాయుల పెరుగుదల మధ్య నేరుగా సంబంధం ఉంది. తెల్ల బియ్యంలో హై గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది, అంటే ఇది త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర నియంత్రణకు చూసే వారు తెల్ల బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. బియ్యం తిన్నా షుగర్ పెరగనివ్వకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు.

పరిమితంగా తినండి – ఎక్కువగా కాకుండా, కొంతమేరకు మాత్రమే తీసుకోవాలి. బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్ ప్రత్యామ్నాయం – ఇవి తక్కువ GI కలిగి ఉండి నెమ్మదిగా గ్లూకోజ్ విడుదల చేస్తాయి. పోటీన్ మరియు ఫైబర్ కలిపి తినండి – బియ్యంతో పాటు పప్పులు, కూరగాయలు, గడ్డి గింజలు కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయులు మెరుగుపడతాయి. ఒకేసారి ఎక్కువగా తినకండి – చిన్న చిన్న భాగాలుగా విభజించి తినడం మంచిది. నైట్ టైమ్‌లో ఎక్కువగా తినొద్దు – రాత్రి సమయంలో మెటాబాలిజం మందగించడంతో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: