
విటమిన్ E అధికంగా ఉండటంతో చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా మెరుగుపడటానికి అవసరమైన బయోటిన్ అందిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నానబెట్టిన బాదాల్లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణ. బాదంలో ఉండే మ్యాగ్నీషియం, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకల బలం పెరుగుతుంది.కేల్షియం, ఫాస్పరస్, మాగ్నీషియం అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా మారతాయి.పెద్దవారిలో ఆస్టియోపోరోసిస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
హార్మోన్లను సమతుల్యం చేయడంలో బాదం సహాయపడుతుంది, ముఖ్యంగా మహిళలకు PCOS సమస్య ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రాత్రి 4-6 బాదాలు నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినాలి.పొట్టు తీసి తింటే, అంతర్లీన పోషకాలు శరీరానికి సులభంగా గ్రహించబడతాయి. తేనె, గుడ్డు, లేదా మిల్క్‌తో కలిపి తీసుకుంటే మరింత మంచిది.నిత్యం 4-6 నానబెట్టిన బాదాలు తింటే మెదడు, గుండె, చర్మం, జీర్ణక్రియ, బరువు నియంత్రణకు చాలా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి బాదాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. బాదం ఫ్యాట్స్ మరియు ఫైబర్ కలిగి ఉండటంతో, ఇది తేలికగా నిండిన అనుభూతిని కలిగించి, ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది.