
ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇదే నిజమైంది. నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయితే మెదడులో అమిలాయిడ్-బీటా అనే ప్రోటీన్ ఉత్పత్తి ఎక్కువైందట. ఈ ప్రోటీనే అల్జీమర్స్ రావడానికి ముఖ్య కారణం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే... అల్జీమర్స్ పేషెంట్ల మెదళ్లలో 'జింజిపైన్స్' అనే డేంజర్ ఎంజైమ్స్‌ను కూడా కనుగొన్నారు. ఈ ఎంజైమ్స్‌ను 'పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్' బ్యాక్టీరియానే తయారుచేస్తుందట.
అంతేకాదు, అల్జీమర్స్ ఉన్నవాళ్ల మెదళ్లలో టౌ ప్రోటీన్, యూబిక్విటిన్ అనే పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి కూడా ఈ వ్యాధికి సంకేతాలే. విచిత్రం ఏంటంటే, అల్జీమర్స్ లేనివాళ్ల మెదళ్లలో కూడా జింజిపైన్స్ కనిపించాయట. అంటే, అల్జీమర్స్ లక్షణాలు బయటపడకముందే ఈ బ్యాక్టీరియా దాడి మొదలుపెడుతుంది.
ఈ బ్యాక్టీరియా మెదడులోకి ఎంటర్ అయి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ పుట్టిస్తుంది. ఆ తర్వాత అమిలాయిడ్ ఫలకాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ ఫలకాలే అల్జీమర్స్ వ్యాధికి ముఖ్య లక్షణం. అందుకే నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. చిగుళ్ల వ్యాధి వస్తే డిమెన్షియా వచ్చే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త.
మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. రోజూ బ్రష్ చేసుకోవడం, ఫ్లాస్ చేసుకోవడం, రెగ్యులర్ గా డెంటిస్ట్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లడం వంటివి చేస్తే అల్జీమర్స్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ లింక్ గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతోంది కానీ, నోటి ఆరోగ్యం మన మెదడుకు కూడా చాలా ముఖ్యం అని మాత్రం ఈ స్టడీ తేల్చేసింది. అందుకే దేన్ని నిర్లక్ష్యం చేసిన నోటి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పుకోవచ్చు.