చాలామంది నిద్ర పట్టటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కొన్ని ఆహారాలు లేదా పానీయాలు తాగటం వల్ల నిద్దర ద్వారా ఉంటుంది. మరికొంతమంది మాత్రం బెడ్ మీద పడుకున్నా వెంటనే నిద్ర పట్టేస్తుంది. నిద్ర పోవాలంటే కొంతమంది ఎంతో ఇబ్బంది పడతారు. నిద్రకు సహకరించే కొన్ని ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. వీటిని తింటే నిద్ర త్వరగా వస్తుంది. అశ్వగంధ టి ఒత్తిడిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. లోతుగా నిద్ర పట్టేలా చేస్తుంది. కొవ్వు పట్టిన చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి నిద్రను ప్రేరేపిస్తాయి.

వెచ్చా నీ పాలు తాగటం వల్ల నిద్ర బాగా పడుతుంది. చిలకడదుంపలు నిద్ర హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఓట్ మీల్ ప్రతిరోజు తింటే నిద్ర హాయిగా పడుతుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, ట్రెప్టోఫాన్ లు ఉంటాయి. ఇవి మెలటోనిన్ స్థాయిలో పెంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. టిఫిన్ ఉండే టీ, కాఫీలు తాగటం తగ్గించాలి. అలాగే కారం నిండి ఆహారాలు కూడా తినకూడదు. ఇవి నిద్రను అడ్డుకుంటాయి. అల్మండ్స్, మెలటోనిన్, మాగ్నీషియం ఉండటం వల్ల నిద్రను మెరుగుపరిచే శక్తి ఉంది. వాల్నట్స్, మెలటోనిన్, ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండి నిద్రను ప్రేరేపిస్తాయి. కీవీ పండు – ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరిచే సరోజినిన్ ను కలిగి ఉంటుంది.

యోగర్ట్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల నిద్రకు సహాయపడుతుంది. మాగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. జొన్న రొట్టె, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారంగా ఇది నిద్రను మెరుగుపరచవచ్చు. బియ్యం, ముఖ్యంగా జాస్మిన్ రైస్ తినడం వల్ల త్వరగా నిద్రపడే అవకాశం ఉంది. క్యామొమైల్ టీ,  నిద్రకోసం సహజసిద్ధమైన ఔషధమైన ఈ టీ అన్సియాలిటిని తగ్గించడంలో సహాయపడుతుంది. వాలెరియన్ రూట్ టీ, ఇది నిద్ర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. టార్టె చెర్రీ జ్యూస్,మెలటోనిన్ సమృద్ధిగా ఉండటంతో నిద్రను మెరుగుపరుస్తుంది.ఈ ఆహార పదార్థాలను రాత్రి భోజనంలో చేర్చుకోవడం ద్వారా నిద్ర మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: