బరువు తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ చాలా మంచి ఎంపిక. దీనిని రోజూ తాగడానికి రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా తయారుచేసే కొన్ని రకాల రిసిపీలు ఇవే. క్యారెట్-నిమ్మ జ్యూస్. 2 క్యారెట్లు, ½ నిమ్మరసం, స్పూన్ తేనె, కప్పు నీరు, క్యారెట్లను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. జ్యూస్‌ను గట్టిగా ఫిల్టర్ చేసి, నిమ్మరసం కలపాలి. తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది టాక్సిన్స్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది మరియు డైజెషన్‌ను మెరుగుపరుస్తుంది. క్యారెట్-ఆపిల్-అల్లం జ్యూస్ కవాల్సినవి 2 క్యారెట్లు,

1 చిన్న ఆపిల్, ½ అంగుళం అల్లం, ½ నిమ్మరసం,1 కప్పు నీరు. క్యారెట్, ఆపిల్, అల్లం ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి.ఫిల్టర్ చేసి నిమ్మరసం కలిపి తాగాలి. ఇది మెటాబాలిజం పెంచి ఫాట్ బర్నింగ్‌ను వేగవంతం చేస్తుంది. క్యారెట్-బీట్‌రూట్-ఆరంజ్ జ్యూస్.కావాల్సినవి. 2 క్యారెట్లు, ½ బీట్‌రూట్,1 ఆరంజ,½ స్పూన్ తేనె, తయారీ, క్యారెట్, బీట్‌రూట్ ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఆరంజ్ రసం, తేనె కలిపి బాగా మిక్స్ చేసి తాగాలి. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. క్యారెట్-పుదీనా జ్యూస్.కావాల్సినవి.

2 క్యారెట్లు, 5-6 పుదీనా ఆకులు, ½ స్పూన్ జీలకర్ర పొడి,1 కప్పు నీరు. క్యారెట్, పుదీనా ఆకులు బ్లెండ్ చేయాలి. జీలకర్ర పొడి కలిపి ఫిల్టర్ చేసి తాగాలి. డైజెస్టివ్ సిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్‌గా తాగొచ్చు. రాత్రి తాగే ముందు అధిక పంచదార కలపకుండా చూసుకోవాలి. రోజూ తాగే ముందు జ్యూస్ తాజాగా తయారు చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్‌తో పాటు తగినంత నీరు తాగాలి. హెల్తీ డైట్ మరియు వర్కౌట్‌తో పాటు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: