
మచ్చలు తగ్గుతాయి. బీట్‌రూట్ టోనర్ – గ్లోయింగ్ స్కిన్ కోసం.2 టేబుల్ స్పూన్లు బీట్‌రూట్ రసం,1 టేబుల్ స్పూన్ గులాబీ నీరు.రెండు పదార్థాలను బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేయండి. రోజూ ముఖం కడిగిన తర్వాత టోనర్‌ను ముఖంపై స్ప్రే చేయండి లేదా కాటన్‌తో అప్లై చేయండి.చర్మం టానింగ్ తగ్గి, నలుపు మాయమవుతుంది. బీట్‌రూట్ స్క్రబ్ – డెడ్ స్కిన్ తొలగించేందుకు.1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం,1 టేబుల్ స్పూన్ చక్కెర లేదా ఓట్స్ పౌడర్, 1 స్పూన్ కొబ్బరి నూనె. అన్ని పదార్థాలను కలిపి మృదువుగా మిక్స్ చేయండి. ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి.
5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. డెడ్ స్కిన్ తొలగించి, స్కిన్ టెక్స్చర్ మెరుగుపరిచే సహాయపడుతుంది. బీట్‌రూట్ లిప్ బామ్ – పెదవులకు సహజంగా రంగు వచ్చేలా.1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం,1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,½ స్పూన్. బీట్‌రూట్ రసం, కొబ్బరి నూనె, బీస్‌వాక్స్‌ను వేడి చేసి మెత్తగా కలుపుకోండి. చిన్న కంటైనర్‌లో స్టోర్ చేసి రోజూ పెదవులకు అప్లై చేయండి. బీట్‌రూట్, గాజరా ముక్కలు మిక్సీలో వేసి రసం తీసుకోండి. దీనికి నిమ్మరసం కలిపి, రోజూ ఉదయం తాగండి. చర్మానికి సహజమైన మెరుగు వస్తుంది, మచ్చలు తగ్గుతాయి.