
ద్రాక్షను మిక్సీలో బ్లెండ్ చేసి జ్యూస్ తయారు చేయండి. ద్రాక్ష రసాన్ని మజ్జిగలో కలిపి, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయండి. ఇది వేసవిలో కూలింగ్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ద్రాక్ష-బాదం స్మూతీ,1 కప్పు గ్రీన్ లేదా రెడ్ ద్రాక్ష, 5-6 బాదం, 1 కప్పు పాలు లేదా ఆల్మండ్ మిల్క్, ½ స్పూన్ తేనె.బాదం, పాలును మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. తేనె కలిపి మళ్లీ మిక్స్ చేసి గ్లాస్‌లో పోసి తాగండి. ఇది బరువు తగ్గే ప్రాసెస్‌లో సహాయపడుతుంది. మరిణేట్ చేసిన ద్రాక్ష.
1 కప్పు ద్రాక్ష, ½ టేబుల్ స్పూన్ నిమ్మరసం,½ స్పూన్ చాట్ మసాలా,½ స్పూన్ మెంతి పొడి, ద్రాక్షను ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో నిమ్మరసం, చాట్ మసాలా, మెంతి పొడి కలిపి 10 నిమిషాలు ఉంచండి. స్నాక్‌గా తింటే రుచిగా, హెల్తీగా ఉంటుంది. శుభ్రంగా కడిగిన ద్రాక్షను నిమ్మరసం చల్లి ఫ్రిజ్‌లో ఉంచండి. 2-3 గంటల తర్వాత ఫ్రోజన్ స్నాక్‌లా తింటే రుచిగా ఉంటుంది. వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది. ఒక పెద్ద బాటిల్‌లో ద్రాక్ష, పుదీనా ఆకులు వేసి, నీరు పోసి 4-5 గంటలు ఉంచండి. ఇది డిటాక్స్ డ్రింక్‌గా పనిచేసి శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.