మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలియదు. మిరియాలు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని నివారించడానికి ఇది సహాయపడుతుంది. డైలీ ఒకటి లేదా రెండు మిరియాలను తప్పకుండా తినాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 3-4 తల మిరియాలు తినడం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మెటాబాలిజం బూస్టింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొన్ని రకాల వ్యాధులను అడ్డుకుంటాయి. ఖాళీ కడుపుతో మిరియాలు తినడం వల్ల కలిగే లాభాలు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మిరియాలు జీర్ణ రసాలను ఉత్పత్తి చేసి ఆహారాన్ని సులభంగా మరిగేలా చేస్తాయి. గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.రోజూ 3-4 మిరియాలు తినడం LDL (కెడు కొలెస్ట్రాల్) ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.జలుబు, దగ్గు, విరేచనాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. మిరియాల్లో ఉన్న పైపెరిన్ మెటాబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. మెమరీ పవర్ పెరిగి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. మిరియాలు ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి, చర్మాన్ని తక్కువ వయస్సుగా ఉంచుతుంది. మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే 3-4 మిరియాలు నీటితో మింగాలి.  3-4 మిరియాలను పొడి చేసి 1 స్పూన్ తేనెలో కలిపి తినాలి. మిరియాలను నీటిలో మరిగించి తాగాలి.అధికంగా మిరియాలు తినకూడదు, లేనిచో పొట్టలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. ఆసిడిటి ఉన్నవారు తక్కువగా వాడాలి. ప్రెగ్నెంట్ మహిళలు అధికంగా తీసుకోవడం మంచిది కాదు.ఈ విధంగా మితంగా మిరియాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: