
జుట్టు నష్టాన్ని తగ్గించి, కొత్త జుట్టు మొలుస్తుంది. కరివేపాకు-పాలు హెయిర్ మాస్క్.1 కప్పు తాజా కరివేపాకు,½ కప్పు పెరుగు లేదా కోకోనట్ మిల్క్.కరివేపాకును బ్లెండర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేయండి. దీనికి పెరుగు లేదా కొబ్బరి పాలు కలిపి మిశ్రమం తయారు చేయండి. ఈ మాస్క్‌ను తలకు రాసి 30-40 నిమిషాలు ఉంచి, షాంపూతో కడిగేయండి. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. కరివేపాకు-ఆమ్లా హెయిర్ ప్యాక్.1 కప్పు కరివేపాకు,1 ఆమ్లా,1 టేబుల్ స్పూన్ బాదం నూనె. కరివేపాకు, ఆమ్లాను బ్లెండ్ చేసి మెత్తగా చేయండి.
బాదం నూనె కలిపి తలకు రాసి 40 నిమిషాలు ఉంచండి. గోరువెచ్చని నీటితో కడిగేయండి.తెల్ల జుట్టును నియంత్రించి, జుట్టు మృదువుగా మారుస్తుంది. కరివేపాకు-అరటిపండు మాస్క్,1 అరటి పండు,1 కప్పు కరివేపాకు,1 టేబుల్ స్పూన్ తేనె. అరటి పండును మెత్తగా మధించి, కరివేపాకు పేస్ట్ కలపండి. తేనె కలిపి తలకు, జుట్టుకు రాసి 30 నిమిషాలు ఉంచండి. చల్లని నీటితో కడిగేయండి. జుట్టును మృదువుగా, సిల్కీగా మార్చుతుంది. నీటిని మరిగించి అందులో కరివేపాకు వేసి 5 నిమిషాలు మరిగించండి. తేనె కలిపి తాగండి. జుట్టుకు అవసరమైన పోషకాలు అందించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.