
బాదం – మెమరీ పవర్ పెంచే విటమిన్ E, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్సర్‌సైజ్ లేదా యోగా చేయండి.రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో రక్తప్రసరణ పెరుగుతుంది. సిరసాసనం, పద్మాసనం, బ్రహ్మరి ప్రాణాయామం మెదడు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. రాత్రి మంచి నిద్ర తీసుకోవాలి.6-8 గంటల నాణ్యమైన నిద్ర లేకపోతే మెదడు పనిచేయదగిన స్థాయిలో ఉండదు. మెదడుకు వ్యాయామం ఇవ్వండి. ఉదయాన్నే సుడోకు, పజిల్స్, చెస్, మెమరీ గేమ్స్ ఆడటం మెదడు శక్తిని పెంచుతుంది. కొత్త భాష లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మెదడును ఉత్తేజితంగా ఉంచుతుంది.
మొబైల్, టీవీకి దూరంగా ఉండండి.నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. ఉదయాన్నే కొన్ని నిమిషాలు ప్రకృతిలో గడపడం, పక్షుల కిలకిలారావాలు వినడం మెదడును రిఫ్రెష్ చేస్తాయి.తేనె & మిరియాలు కలిపిన నీరు తాగండి. మెదడుకు రక్తప్రసరణ పెరిగి, శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం నరాల శక్తిని మెరుగుపరిచి, మెమరీ లాస్ తగ్గించేందుకు సహాయపడుతుంది.ఉదయం ఈ సూపర్ ఫుడ్ తీసుకోండి.ఖర్జూరాలు + పాలుపాలు – మెదడుకు ఇనర్జీ అందిస్తుంది.తేనె + నిమ్మరసం – మానసిక ముప్పులను తగ్గిస్తుంది. కేశర్ దూద్ – జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే ఇవి పాటించండి.