
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఫైబర్ అధికంగా ఉండటం వల్ల దీన్ని తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అధికంగా తినకుండా కాపాడుతుంది. చర్మం మరియు జుట్టుకు మెరుగైన పోషణ.ఇందులోని విటమిన్ E, ప్రోటీన్, బయోటిన్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల బలం పెరుగుతుంది.ఇందులో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉండటంతో ఎముకల బలం పెరుగుతుంది. మధుమేహం నియంత్రణలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉండటంతో ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు పెరుగుతుంది – అధికంగా తింటే కాలరీలు ఎక్కువగా అంది బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఓవరీటింగ్ సమస్య – ఎక్కువ తింటే అజీర్ణం, కడుపునొప్పి రావచ్చు. నడుము నొప్పి లేదా మూత్రాశయ రాళ్లు – ఎక్కువగా తింటే జీడిపప్పులో ఉన్న ఆక్సలేట్స్ మూత్రాశయ రాళ్లకు కారణమవ్వొచ్చు. అలర్జీలు – కొంతమందికి జీడిపప్పు వల్ల చర్మ అలర్జీలు, ఉబ్బసం రావచ్చు. రోజుకు 5-10 జీడిపప్పులు తినడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తినాలంటే, భోజనంలో బాలన్స్ చేసుకోవాలి. మోస్తరు పరిమాణంలో తింటేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది. శక్తి పెరుగుతుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో, ఇది ఎనర్జీ బూస్టర్‌గా పని చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల దీన్ని తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అధికంగా తినకుండా కాపాడుతుంది.