
తేనె: కంటి కింద తేనె అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. బటాటా: తురిమిన బటాటా రసం తీసుకుని కళ్లపై పెట్టాలి. కీరా ముక్కలు: కళ్లపై 15 నిమిషాలు ఉంచితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. టీ బ్యాగ్స్: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్ తడిపి కళ్లపై 10-15 నిమిషాలు ఉంచాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి.విటమిన్ C, విటమిన్ K, ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. బాదం, పచ్చి బఠాణీలు, ద్రాక్ష, పాలకూర, గుడ్లు తీసుకోవడం మంచిది.
బయటకు వెళ్తే SPF 30+ సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల సన్ డామేజ్ వల్ల నల్లటి వలయాలు రాకుండా ఉంటుంది. మెడిటేషన్, యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కంటి కింద నల్లటి వలయాలు పోతాయి. రెటినాల్, విటమిన్ C, హయాలురోనిక్ యాసిడ్ ఉండే క్రీమ్‌లు వాడాలి. కొన్ని సార్లు నల్లటి వలయాలు జీనెటిక్ కారణాల వల్ల కూడా రావచ్చు. ఐరన్ లేదా హేమోగ్లోబిన్ లెవల్స్ తక్కువగా ఉన్నా నల్లటి వలయాలు రావచ్చు, అందుకే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. నియమితంగా ఈ చిట్కాలు పాటిస్తే కొన్ని వారాల్లో మార్పు కనిపిస్తుంద. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనె లేదా బాదం నూనె వాడి కంటి చుట్టూ నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.