
రేగు ఆకుల కషాయం డయేరియా, డిజెషన్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఉండటంతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.తక్కువ కాలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఎక్కువ తినకుండా నియంత్రించవచ్చు. కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ A ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఫోలేట్ మరియు ఐరన్ ఉండటంతో గర్భిణీలకు మంచి పోషకాహారం అవుతుంది. మెగ్నీషియం శరీరానికి రిలాక్సేషన్ కలిగించడంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ B6, B3 మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. తాజా పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్ లేదా స్మూతీలుగా తీసుకోవచ్చు. ఆకులను కషాయం చేసుకుని తాగొచ్చు. అధికంగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. మితంగా తీసుకోవడం మంచిది. రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. రేగు పండులో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. మధుమేహ నియంత్రణ.రేగు పండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.