
ప్రేమ వివాహం అయితే పర్లేదు .. కానీ దాదాపు పెద్దలకు కుదురుచి చేసిన వివాహాల్లో భర్త వయసు భార్య కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇటీవల కాలంలో ఈ గ్యాప్ కాస్త తగిన కొన్ని చోట్ల ఇలాంటి వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. అలా ముందు తరంలో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా జరిగాయి. దాదాపు 10 ఆ ఏజ్‌కు పైగా గ్యాపు ఉన్న కపుల్స్ కూడా ఉండేవారు. కొందరు సెలబ్రిటీలు కూడా ఈ ఏస్ గ్యాప్ ని స్వాగతిస్తున్నారు. అయితే భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే మంచిదా చెడ్డదా ?అన్నదానిపై చాలా ఆసక్తికర చర్చలే ఉన్నాయి. ఇలా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు కెరీర్ పై భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటివారు కలిసి లైఫ్ లీడ్ చేయడం మంచిదా .. చెడ్డదా సాధారణంగా భార్యాభర్తల మధ్య మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఏజ్ గ్యాప్ అనేది మంచిదిగా చెప్తారు. కానీ 10 + వయసు తేడా ఉండటం వల్ల దాని వల్ల కలిగే లాభనష్టాలు ఏంటో చూద్దాం.
లాభాలు :
ఈ తరహా వివాహాలు చేసుకున్నప్పుడు వయసులో పెద్దయిన వారికి వారి ఎదుర్కొన్న పరిస్థితులలో మెచ్యూరిటీ బాగుంటుంది. రిలేషన్ లో స్టేబుల్ గా ఉండే అవకాశం ఎక్కువ. లైఫ్ లో మీకంటే ఎక్కువ జీవితాన్ని చూసి ఉంటారు. కాబట్టి వారి అనుభవాలు జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడానికి సరిపోతుంది. ఆర్థికంగా సెటిల్ అయ్యే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో డబ్బు పరంగా ఇబ్బందులు రావు .. గొడవలు పెద్దవి కాకుండా తమ కమ్యూనికేషన్ స్కిల్స్ తో మీకు సర్దిచెప్పి వారి సర్దుకుపోతూ ఉంటారు.
నష్టాలు :
ఏ తరహా పెళ్లి అయినా జంట మధ్యలో ఇబ్బందులు ఉంటయి. అయితే మరి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే .. వయసులో పెద్దవారు చిన్న అనేభావంతో అర్థం చేసుకోకుండా.. అన్ని నాకే తెలుసు అనే ధోరణిలో వ్యవహరించే అవకాశం ఉంది. వయసులో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. త్వరగా రావొచ్చు కూడా. అది సంబంధాన్ని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఎఫెక్ట్ చూపిస్తుంది. వయస్సులో చిన్న వారికి సోషల్ మీడియా ప్రభావం ఉంటే అది కూడా ఇబ్బంది అవుతుంది.