
బెల్లం + అల్లం, అల్లంలో యాంటీఆక్సిడెంట్లు & యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది రక్త నాళాలను శుభ్రపరిచి, గుండె దెబ్బ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెల్లం + నువ్వులు,నువ్వుల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మాగ్నీషియం ఉండటంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని కలిపి లడ్డూలు చేసుకుని తింటే బీపీ తగ్గి, గుండె మెరుగుగా పని చేస్తుంది. బెల్లం + పచ్చి వెల్లుల్లి,వెల్లుల్లి రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడుతుంది. రోజూ ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బతో చిన్న ముక్క బెల్లం తింటే బీపీ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లం + వాము,ఇది రక్త ప్రసరణ మెరుగుపరచి, గుండెకు మేలు చేస్తుంది.బెల్లంతో పాటు వాము నీళ్లు తాగితే గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. బెల్లం + కప్పు గోరువెచ్చటి పాల,ఇది బీపీ & కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది.
రాత్రి పడుకునే ముందు తాగితే మెదడు విశ్రాంతి తీసుకుని, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లం + గోధుమ రవ్వ, గోధుమ రవ్వ ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండటంతో రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. దీని నుంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రోజుకు 10-20 గ్రాముల వరకు మాత్రమే బెల్లం తీసుకోవాలి. ప్రాసెస్డ్ షుగర్‌కు బదులు బెల్లం ఉపయోగించడం చాలా మంచిది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.జంక్ ఫుడ్, ఎక్కువ ఉప్పు & నూనె వాడకాన్ని తగ్గించాలి. ఈ టిప్స్ పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటూ, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.