మలబద్ధకాన్ని తగ్గించేందుకు అధిక ఫైబర్ & నీటి శాతం ఉండే కూరగాయలు తినడం చాలా అవసరం. ఇవి జీర్ణప్రక్రియను మెరుగుపరిచి, సహజ రీతిలో మల విసర్జనను సులభతరం చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గించే 9 అత్యుత్తమ కూరగాయలు. పాలకూర, పొటాషియం & ఫైబర్ అధికంగా ఉండటంతో మలాన్ని సాఫీగా బయటికి పంపుతుంది. పచ్చిగా లేదా వండుకుని తినొచ్చు. గుమ్మడికాయ,నీటి శాతం & ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది హల్వా, కూర, సూప్ రూపంలో తీసుకోవచ్చు. కారెట్, ఇది నేచురల్ ల్యాక్సటివ్ లాగా పనిచేస్తుంది. పచ్చిగా, జ్యూస్, లేదా సూప్‌లో తీసుకుంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

బెండకాయ, ఒక్రాలో మ్యూసిలేజ్ అనే పదార్థం ఉండటం వల్ల మలాన్ని నెమ్మదిగా మరియు సాఫీగా బయటికి పంపిస్తుంది. వేపుడు, కూర లేదా సాంబార్‌లో వాడొచ్చు. బీట్‌రూట్, అధిక ఫైబర్ & యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. సలాడ్, జ్యూస్ లేదా కూరలో వాడితే మలబద్ధకానికి మంచి పరిష్కారం. బందకోబీ,అధిక నీటి శాతం & ఫైబర్ ఉండటంతో పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది కూర, సలాడ్ లేదా పరాఠా రూపంలో తినొచ్చు. టమాటా, టమాటాలో నేచురల్ యాసిడ్స్ ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

 పచ్చిగా తినొచ్చు లేదా జ్యూస్, కూర, సూప్ రూపంలో తీసుకోవచ్చు. ముల్లంగి. డైజెస్టివ్ ఎన్జైమ్‌లు అధికంగా ఉండటం వల్ల మలాన్ని సాఫీగా బయటికి పంపుతుంది. సలాడ్, కూర లేదా పరాఠాలో తీసుకోవచ్చు. సొరకాయ, 90% నీటి శాతం ఉండటం వల్ల మలాన్ని మృదువుగా మార్చి విసర్జన సులభతరం చేస్తుంది. పప్పు, కూర, సూప్, జ్యూస్‌గా తీసుకోవచ్చు.రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. అధిక ప్రాసెస్‌డ్ ఫుడ్, గడ్డి పోషకాలు లేని ఆహారం తగ్గించాలి. ఉదయాన్నే వేడినీటితో నిమ్మరసం తాగితే మలబద్ధకాన్ని తగ్గించవచ్చు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, వ్యాయామం చేయాలి.పెరుగును క్రమంగా తినడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: