
మానవ జీవితానికి నిద్ర అనేది చాలా అవసరం.. నిద్ర మీద కూడా పెట్టుబడి పెడితే ఎన్నో లాభాలు ఉంటాయట. దీనిపై ఓ ఆసక్తికర స్టోరీ వైరల్ అవుతోంది. దీని ప్రకారం నిద్ర అనేక రోగాలను తగ్గిస్తుంది ..
నిద్ర హార్మోన్ల సమతుల్యత పెంపొందించి శరీరాన్ని బాగు చేస్తుంది.. నిద్ర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నిద్రలో అనేక దశలు SleepCycle ఉంటాయి.. అందులో ముఖ్యమైన దశలు చూద్దాం.
N1 దశ -
ఈ దశ ఒక నిమిషం నుండి 7 నిమిషాలు ఉంటుంది. ఇదే మెల్లిగా నిద్రలో జారుకునే దశ.. మెదడు కూడా మెల్లిగా ఓవర్ ఆయిలింగ్ కి కావాల్సిన అన్ని సమకూర్చుకుంటుంది.
N2 దశ -
ఈ దశలో మెదడు శరీరాన్ని గాఢమైన నిద్ర లోకి తీసుకు వెళ్తుంది.. దీనికి గరిష్ఠంగా 20 నిమిషాలు పడుతుంది ఆ సమయంలో శరీరంలో రిపేర్ ప్రాసెస్ మొదలు అవుతుంది.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది..
ఊపిరి పీల్చే వేగం తగ్గిస్తుంది .. ఒక మనిషి నిద్రలో సగ భాగం N2 దశలో ఎక్కువ భాగం ఉంటుంది.
N3 దశ -
ఇది గాఢ నిద్రకి దారి తీసే దశ.. ఈ దశలోనే శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనిషి యొక్క సృజనాత్మకత, జ్ఞాపకాల తరంగాలను మెదడు పంపిస్తూ ఉంటుంది.. వీటినే పరిశోధకులు అంటారు.
ఆఖరి దశ REM -
అంటే రాపిడ్ ఐ మూవ్మెంట్ .. ఈ దశలో మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయ్ అప్పుడే మనకి కలలు వస్తాయ్.. ఈ దశలో మానవ ఆలోచన తీరును ప్రవీవితం చేస్తాయి.. ఇలా అనేక రకాలుగా నిద్ర ఉంటుంది.. అన్ని దశల్లోనూ మన శరీరం సమర్థవంతంగా పని తీరు కనపర్చకపోతే శరీర సమతుల్యం దెబ్బతిని వ్యాధులు, మానసిక సమస్యలకు దారి తీస్తాయి..
ఇక నిద్రను అశ్రద్ధ చెయ్యద్దు .. కోట్లు ఉన్న కంటి నిండ నిద్ర లేకపోతే మన వెల్త్ కి అర్ధం లేదు..
అందుకే నిద్ర మీద పెట్టుబడి పెట్టండి.. జీవితం అనే మంచి రాబడి వస్తుంది.