క్యారెట్లు పోషకాహారం మరియు ఆరోగ్య ప్రయోజనాల పరంగా అద్భుతమైన కూరగాయలు. వీటిని రుచికరమైన విధంగా వండుకుని తినడంవల్ల పిల్లలు కూడా సులభంగా తినగలుగుతారు. క్యారెట్ హల్వా, తురిమిన క్యారెట్ – 2 కప్పులు, పాల్ – 2 కప్పులు, షుగర్ – ½ కప్పు,నెయ్యి – 2 టీస్పూన్లు, ఏలకుల పొడి – ½ టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ – ఆల్మండ్స్, కిస్మిస్, కాజూ,పాన్‌లో నెయ్యి వేసి క్యారెట్‌ని వేసి కొద్దిసేపు వేగించాలి. పాలు పోసి తక్కువ మంటపై మరిగించాలి. పాల్ గట్టిపడి, క్యారెట్ మెత్తబడిన తర్వాత షుగర్ వేసి కలిపి, ఏలకుల పొడి జత చేయాలి.

డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి హల్వాలో కలిపితే క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ పరాటా,గోధుమ పిండి – 2 కప్పులు,తురిమిన క్యారెట్ – 1 కప్పు, కారం – ½ టీస్పూన్, జీలకర్ర – ½ టీస్పూన్,ధనియాల పొడి – ½ టీస్పూన్,ఉప్పు – రుచికి తగినంత,నెయ్యి లేదా నూనె – అవసరమైనంత. తురిమిన క్యారెట్, గోధుమ పిండి, మసాలాలు, ఉప్పు కలిపి పిండి కలిపుకోవాలి.నీరు తగినంత పోసి మృదువుగా కలిపి చపాతీలా చేసుకోవాలి. తవా మీద నూనె లేదా నెయ్యి వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి.పెరుగు లేదా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

క్యారెట్ సూప్,తురిమిన క్యారెట్ – 1 కప్పు, ఉల్లిపాయ – 1,వెల్లుల్లి – 2 రెబ్బలు,మిరియాల పొడి – ½ టీస్పూన్,ఉప్పు – రుచికి తగినంత,నీరు లేదా వెజ్ స్టాక్ – 2 కప్పులు, ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ వేగించాలి. క్యారెట్ వేసి రెండు నిమిషాలు వేగించాలి.నీరు లేదా వెజిటబుల్ స్టాక్ పోసి 10 నిమిషాలు మరిగించాలి. సూప్ మెత్తగా చేసేందుకు మిక్సీలో బ్లెండ్ చేసుకోవచ్చు. చివరిగా మిరియాల పొడి, ఉప్పు వేసి వేడిగా తాగాలి. క్యారెట్ మరియు బీట్‌రూట్ సలాడ్.తురిమిన క్యారెట్ – 1 కప్పు,తురిమిన బీట్‌రూట్ – ½ కప్పు,నిమ్మరసం – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత,పెరుగు – 2 టీస్పూన్లు,కొత్తిమీర తరుగులు. అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో వేసి బాగా కలపాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: