
1 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్లు పాలు,సేనగపిండి, ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి కడగాలి. ఇది పొడి చర్మానికి తేమను అందిస్తుంది.మొటిమలు తగ్గించడానికి పసుపు - అలొవెరా మిశ్రమం.1/2 టీస్పూన్ పసుపు,1 టీస్పూన్ అలొవెరా జెల్,ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది మొటిమలు తగ్గించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. టాన్ తొలగించడానికి పసుపు - పెరుగు ప్యాక్,1 టీస్పూన్ పసుపు,2 టీస్పూన్లు పెరుగు,1 టీస్పూన్ బేసన్,ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచి కడగాలి. ఇది టాన్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మృతకణాలను తొలగించేందుకు పసుపు - కొబ్బరి నూనె మిశ్రమం.
1/2 టీస్పూన్ పసుపు,1 టీస్పూన్ కొబ్బరి నూనె,1 టీస్పూన్ చక్కెర,ఈ మిశ్రమాన్ని స్క్రబ్ లా ఉపయోగించి మృదువుగా మసాజ్ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పసుపు మాస్క్ వాడిన తర్వాత ముఖాన్ని బాగా కడగాలి, లేదంటే పసుపు రంగు ముఖంపై మిగిలిపోవచ్చు. మాస్క్ అప్లై చేసే ముందు చిన్న భాగంలో టెస్ట్ చేసి చూసుకోవడం మంచిది, ఎందుకంటే కొందరికి అలర్జీ రావచ్చు. వారానికి 2-3 సార్లు వాడటం ఉత్తమం. మీ చర్మ రకానికి అనుగుణంగా సరైన మాస్క్ ఎంచుకుని, కాంతివంతమైన చర్మాన్ని పొందండి.