
జీర్ణవ్యవస్థ సాఫీగా పని చేస్తుంది. నూనె తగ్గించడం వల్ల జీర్ణ సమస్యలు, యాసిడిటీ, గ్యాస్, అపచయం తగ్గుతాయి.కొందరికి మలబద్ధకం కూడా తగ్గవచ్చు. చర్మం మిలమిల మెరుస్తుంది. నూనె తక్కువగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తేలికగా అనిపిస్తుంది. ఎక్కువ నూనె వల్ల వచ్చే మొటిమలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. అధిక నూనె తినకపోవడం వల్ల లివర్ మరియు కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.ఇది శరీర డిటాక్సిఫికేషన్‌ను ప్రోత్సహిస్తుంది. నూనె మానేయడం వల్ల కలిగే సమస్యలు. తక్కువ ఎనర్జీ ఉండొచ్చు. కొవ్వు కూడా శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియెంట్.
పూర్తిగా మానేస్తే శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటోంది, అలసట త్వరగా వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత.కొవ్వు, ముఖ్యంగా ఓమేగా-3, ఓమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. పూర్తిగా మానేస్తే PCOS, రుతుస్రావ సమస్యలు, మూడ్ స్వింగ్స్ రావచ్చు. ఆరోగ్యకరమైన నూనెలు లేకపోతే జుట్టు పొడిగా మారి, ఊడిపోవడం ఎక్కువ అవుతుంది.తలకు సహజమైన తేమ లేకపోవడం వల్ల జుట్టు ఆరోగ్యం తగ్గిపోతుంది. కొవ్వు అవసరమైన విటమిన్ A, D, E, K లను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. నూనె పూర్తిగా మానేస్తే ఈ విటమిన్ల కొరత ఏర్పడి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్ మానేయడం మంచిది.