
సోంపులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల హై బీపీని కంట్రోల్ చేస్తుంది.ఇది రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సోంపు యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్ C, ఐరన్, సెలీనియం అధికంగా కలిగి ఉంటుంది.ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సోంపు ఖరాబైన గొంతు, దగ్గు, ముక్కు గదులు తెరవడంలో సహాయపడుతుంది. శ్వాస సమస్యలు, అస్థమా ఉన్నవారు సోంపు టీ తాగితే ఉపశమనం.రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి. సోంపులో ఫైటోఎస్ట్రోజెన్స్ ఉండటం వల్ల హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. PCOS, పీరియడ్స్ క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలోని కడుపు నొప్పి, క్రాంప్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.
మెదడు శక్తి మెరుగుపడుతుంది.సోంపులోని పోషకాలు మెదడు నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మతిమరుపు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటుంది. రాత్రి నిద్రకి ముందు సోంపు నీరు లేదా సోంపు టీ తాగితే శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి నిద్రనిచ్చే గుణం ఉంటుంది.ఒత్తిడి వల్ల నిద్ర పట్టని వారికీ ఇది సహాయపడుతుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. సోంపులో యాంటీ-బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి లోపలి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.భోజనం తర్వాత సోంపు నములడం నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోంపులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి గుండెపోటు ముప్పును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.