చర్మాన్ని కాంతివంతంగా మార్చే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి చూస్తుంటారు. మెరిసే చర్మానికి కోల్లాజెన్ చాలా ముఖ్యమైనది. ఇది చర్మం వృద్ధాప్య సంకేతాలతో పోరాటానికి సహాయపడుతుంది. వృద్ధాప్యాన్ని నిరోధించే సౌందర్య సాధనాలను మనం తరచుగా ఆశ్రయిస్తాము, కానీ సమతుల్య ఆహారం చర్మం వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవకాడో పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి, ఇది కోల్లాజైన్ విచ్చన్న తను నివారించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

కొల్లాజెన్ అనేది చర్మం తేమను, నిగారింపు కలిగించే ప్రొటీన్. సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు ఇవి. విటమిన్  C ఎక్కువగా ఉండే ఆహారాలు.నిమ్మకాయ, ముసుంబి, కమలాపండ, ద్రాక్ష, కివి, పైనాపిల్,పుచ్చకాయ, సీతాఫలం, బెల్లమి కాయలు.వెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు. కోడిగుడ్లు, చికెన్, చేపలు, సముద్రాహారం,పెరుగు, పనీర్, మజ్జిగ,బాదం, వాల్‌నట్స్, కాష్యూనట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలు. చేపలు,అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్,వేరుశెనగలు, చియా గింజలు. కాల్షియం మరియు జింక్ అధికంగా ఉండే ఆహారాలు.

 పాల ఉత్పత్తులు, గుమ్మడికాయ గింజలు, సొరకాయ, గోధుమ, బ్రౌన్ రైస్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు. ఆకుకూరలు (పాలకూర, ముల్లంగి ఆకులు), గ్రీన్ టీ, అంగూరం, బెర్రీ ఫ్రూట్స్ (బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ) చక్కెర లేని కోకో లేదా డార్క్ చాకొలేట్ ల్లాజెన్ పౌడర్ లేదా బోన్ బ్రోత్. కొల్లాజెన్ పౌడర్ సహజంగా కొల్లాజెన్ పెంచడంలో సహాయపడుతుంది. ఎముకల మాంసం తీసుకోవడం వల్ల సహజ కొల్లాజెన్ పెరుగుతుంది.చర్మం కాంతివంతంగా ఉండాలంటే: పలు రంగుల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు మానేయాలి. సిగరెట్, మద్యం మానితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సహజంగా చర్మం మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: