
కొబ్బరి నీళ్ళలోని ఎంజైమ్స్ మంచి జీర్ణశక్తిని కలిగిస్తాయి. కడుపు శుభ్రం అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది.శరీరంలోని విషతత్వాలను బయటికి పంపిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఫ్యాటీ లివర్ సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గే వారికి మంచిది. కొవ్వు కరుగించడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తుంది. తక్కువ క్యాలరీలు ఉండే తలనొప్పి, అలసట తగ్గించి శక్తిని ఇస్తుంది. చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.చర్మానికి తేమ అందించి డ్రై స్కిన్, మొటిమలు, ముడతలు రాకుండా చేస్తుంది.
స్కిన్ గ్లో పెరగడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల హై బీపీ నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండెకు మంచిది, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. లో బీపీ ఉన్నవారు → పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోటు మరీ తగ్గవచ్చు. మూత్రపిండ సమస్యలున్నవారు → పొటాషియం అధికంగా ఉండటంతో మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే డిటాక్స్ ప్రభావం ఎక్కువ. జిమ్ తర్వాత తాగితే శరీరానికి ఎలక్ట్రోలైట్లు అందుతాయి. భోజనం తర్వాత తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 1 గ్లాస్ కొబ్బరి నీళ్లలో 1/2 నిమ్మరసం కలపాలి. రుచికి తేనె / అల్లం తురుము కలిపి తాగొచ్చు.