
దీర్ఘకాలిక నిద్ర సమస్యలు ఉన్నవారు దీనిని వాడితే ఉపయోగకరం. లావెండర్ టీ.లావెండర్ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి నిద్రను మెరుగుపరుస్తుంది. స్ట్రెస్, డిప్రెషన్, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి 9-10 గంటల మధ్య తాగితే బాగా పనిచేస్తుంది. అశ్వగంధా టీ, ఆదాప్టోజెనిక్ గుణాలు కలిగి ఉండి ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసోల్ స్థాయిని తగ్గించి నిద్ర సాఫీగా రావడానికి సహాయపడుతుంది. రోజూ తాగితే మెదడు ప్రశాంతంగా ఉండి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పుదీనా టీ, జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది.
నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి నిద్ర త్వరగా పట్టేలా చేస్తుంది. రాత్రి తాగితే శరీరం ఫ్రెష్‌గా మారి, శాంతిగా నిద్రపోయేలా చేస్తుంది. గర్భిణీ & తల్లిపాలు ఇస్తున్న మహిళలు – కొన్ని టీలు హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు.లో బీపీ ఉన్నవారు – కొంతమంది టీలు రక్తపోటు మరింత తగ్గించవచ్చు. రాత్రి పడుకునే 30-60 నిమిషాల ముందు తాగితే మంచి ఫలితం. రోజుకు 1 కప్పు మాత్రమే తాగాలి. నిద్ర లోపం ఎక్కువగా ఉంటే స్ట్రెస్ తగ్గించే యోగా, మెడిటేషన్ కూడా చేయాలి. ఈ టీలు సహజమైన మార్గంగా నిద్ర సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయుక్తం. భోజనం తర్వాత లేదా పడుకునే 30 నిమిషాల ముందు తాగితే చాలా మంచిది.