
ఇది సహజంగా కాలాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించి యంగ్ లుక్ ఇస్తుంది. టాన్ & డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. బియ్యం నీరు స్కిన్ బ్రైటెనింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. రోజూ వాడితే సూర్యకాంతి వల్ల కలిగిన నల్లటి మచ్చలు తగ్గుతాయి. పొడి చర్మాన్ని నిమిషాల్లో చేస్తుంది. ఇది సహజ మాయిశ్చరైజర్ లాగా పని చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. బియ్యం నీరులో స్టార్చ్ అధికంగా ఉండడం వల్ల ఫేస్‌లోని పోర్స్ చిన్నవిగా మారతాయి.ఇది స్కిన్ టైట్ & ఫ్రెష్ గా మారేందుకు సహాయపడుతుంది.
ఒక గిన్నెలో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ నీటిని తీసుకుని కాటన్ ప్యాడ్ తో ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. వారానికి 3-4 సార్లు చేస్తే బలమైన ఫలితాలు కనిపిస్తాయి.సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. పాత బియ్యం నీరు ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు – బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాల కోసం కనీసం 2-3 వారాలు రెగ్యులర్‌గా చేయాలి. సహజమైన స్కిన్‌కేర్ టిప్! చర్మాన్ని మెరిసేలా మార్చాలంటే బియ్యం నీరు ఫేస్ వాష్‌గా ఉపయోగించడం మంచి ఎంపిక.