
లిఫ్ట్ బటన్ నొక్కగానే డోర్లు తెరుచుకుంటాయి.. ఆహా వచ్చేసిందా అనుకుని హడావుడిగా లోపలికి అడుగుపెట్టేస్తున్నారా, కాస్త ఆగండి. అదే మీరు చేసే అతిపెద్ద పొరపాటు కావచ్చు. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకుండానే డోర్లు తెరుచుకుంటాయి. లోపల అగాధం మిమ్మల్ని మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది. కళ్లు మూసుకుని దూకినట్టు లిఫ్ట్ కోసం చూడకుండా లోపలికి అడుగుపెడితే.. నేరుగా పాతాళంలోకో, లేక కొన్ని అంతస్తుల కిందికో పడిపోతారు. గుండెలు అదిరే ప్రమాదం అది.
ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటికి కారణం ఎవరు? నిర్వాహకుల నిర్లక్ష్యమా, లేక మన అజాగ్రత్తా? ఏదైనా కానీ, ప్రాణాలు పోయేది మాత్రం మనమే.
ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, సింపుల్, లిఫ్ట్ డోర్లు తెరుచుకున్న వెంటనే తొందరపడకండి. ఒక్క క్షణం ఆగి చూడండి. లిఫ్ట్ క్యాబిన్ వచ్చిందా లేదా అని కళ్లారా చూడండి. అంతా ఓకే అనుకున్నాకే లోపలికి అడుగుపెట్టండి. మీ ఒక్క నిమిషం జాగ్రత్త.. మీ ప్రాణాలను కాపాడుతుంది.
ఇకనుంచైనా లిఫ్ట్ ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులతోనూ పంచుకోండి. జాగ్రత్తే శ్రీరామరక్ష. అలాగే పిల్లలను ఎప్పుడూ కూడా ఒంటరిగా లిఫ్టుల వద్దకు వెళ్లనివ్వవద్దు. పాపం పిల్లలకు ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు కాబట్టి తొందరపడచ్చు. దీని ఫలితంగా వారికి ఏదైనా జరగొచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల వెంటే వెళ్ళాలి. ఒకవేళ ఇతర పిల్లలు అక్కడ ఆడుకుంటున్న వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి.