
బార్లీ నీరు మూత్రశుద్ధిని పెంచుతుంది, తద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.బార్లీ నీరు తక్కువ క్యాలరీలు కలిగి ఉండడంతో పాటు, పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దీంతో అధిక ఆహారం తినకుండా నియంత్రించుకోవచ్చు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల బార్లీ నీరు చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
హృదయ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, దీంతో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల బార్లీ నీరు రక్తపోటును స్తిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఎలా తయారు చేయాలి? 1 కప్పు బార్లీని 4-5 కప్పుల నీటిలో 30-40 నిమిషాలు మరిగించాలి. నీటిని ఫిల్టర్ చేసుకుని, కొద్దిగా నిమ్మరసం లేదా తేనె వేసుకుని తాగొచ్చు. ఈ వేసవిలో బార్లీ నీరు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేసవి వేడిని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ నివారిస్తుంది.ఎండాకాలంలో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. దీంతో అధిక ఆహారం తినకుండా నియంత్రించుకోవచ్చు. శరీరానికి చల్లదనం అందిస్తుంది. బార్లీ నీరు సహజంగా శరీరాన్ని కూల్ చేసేందుకు సహాయపడుతుంది.