నడుము భాగంలో ఎన్నో నరాలు ఉంటాయి. ఇవి త్వరగా ఒత్తిడికి గురవుతాయి. వెన్నుపూసల చుట్టూ ఉన్న కండరాలలో, పెన్ను ముక్కల్ని కలిపి ఉంచే లిగ్మెంట్లలో వచ్చే జబ్బుల్లో నడుం నొప్పి బయటపడుతుంది. కండరాలు, లిగ్మెంట్లలో వచ్చే నొప్పిని స్ట్రైన్ లేదా స్ప్రయిన్ అంటారు. ముందుకు వంగి అలవాటు లేని పని చేయడం, ముఖ్యంగా బరువులు ఎత్తడం వంటి పనుల్లో నడుము నొప్పి తలెత్తే అవకాశం ఉంటుంది. బరువులు ఎత్తే సమయాల్లో కూడా నడుము నొప్పి రావచ్చు.

 కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అదిగా బరువు ఉన్న వ్యక్తులకు నడుము దగ్గర ఉండే కండరాలు, పొట్ట కండరాలు బలహీనంగా ఉండటం వల్ల ఆస్టియో మలేషియా అనే ఎముకల వ్యాధి వల్ల నడుము నొప్పి రావచ్చు. నడుము నొప్పి చాలా మందిని బాధించే సాధారణ ఆరోగ్య సమస్య. దీని కోసం అనేక కారణాలు ఉండవచ్చు. తప్పు కూర్చొనే పద్ధతి,ఎక్కువసేపు ఒకే విధంగా కూర్చోవడం. కంప్యూటర్ లేదా ఫోన్ ఎక్కువగా వాడడం.వంకరగా లేదా ముందుకు వంగి కూర్చోవడం.మామూలు గాయాలు లేదా మసిల్స్ స్ట్రెయిన్. భారం ఎక్కువగా మోసే అలవాటు. తప్పుడు భంగిమలో నిద్రపోవడం. హఠాత్తుగా ఊహించని చలనం.వెన్నెముక సమస్యలు. స్లిప్‌డిస్క్ – వెన్నెముక మధ్య ఉన్న గది లిక్విడ్ బయటికి రావడం.

స్పైనల్ స్టెనోసిస్ – వెన్నెముక నరాలపై ఒత్తిడి పెరగడం. ఆర్థరైటిస్ – వెన్నెముకలో కీళ్ల బలహీనత. లైఫ్స్టైల్ కారణాలు. శారీరక శ్రమ లేకపోవడం. ఎక్కువ బరువు. వైద్య సమస్యలు. కిడ్నీ స్టోన్స్ – వెనుక భాగంలో నొప్పి కలిగించవచ్చు. ఎండోమెట్రియోసిస్ – మహిళల్లో నడుము నొప్పికి కారణం అవుతుంది. ఆస్టియోపోరోసిస్ – ఎముకలు బలహీనపడటం. నివారణ & చికిత్స.తప్పు కూర్చొనే అలవాట్లను మార్చుకోవాలి. దినచర్యలో వ్యాయామాన్ని చేర్చాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. శరీరాన్ని ఎక్కువ సమయం ఒకే స్థితిలో ఉంచకూడదు. వైద్య సూచనల ప్రకారం మందులు లేదా థెరపీ తీసుకోవచ్చు. మీ నడుము నొప్పి తీవ్రమైతే, లేదా దీర్ఘకాలంగా కొనసాగితే, డాక్టర్‌ను సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: