
ఇవి నీటిని ఎక్కువగా గ్రహించి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. జీర్ణక్రియ మెరుగుపరిచే సహజ ఆయుర్వేద ఔషధం.పేగుల్లో మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గ్యాస్, అపచనం వంటి సమస్యలను నివారిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.ఇవి ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటంతో పొట్ట నిండిన భావన కలుగుతుంది, అధిక భోజనం తినకుండా నియంత్రించుకోవచ్చు. మెటబాలిజమ్‌ను బూస్ట్ చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.టాక్సిన్లు తొలగించడంతో పాటు, చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.మొటిమలు, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
షుగర్ లెవెల్స్ నియంత్రణ.డయాబెటిక్ రోగులకు ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇది రక్తంలో షుగర్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయి. 1 టీస్పూన్ సబ్జా గింజలను 1 గ్లాస్ నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టాలి. అవి పూర్తి స్థాయిలో ఉబ్బిన తర్వాత, నిమ్మరసం, తేనె లేదా ఫలహార రసాలతో కలిపి తాగొచ్చు. గ్రీన్ టీ, మిల్క్ షేక్స్, లెమనేడ్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. వారానికి 3-4 సార్లు తాగితే వేసవి వేడి నుంచి రక్షణ కలుగుతుంది.