
కొబ్బరి నూనె + ఆలివ్ నూనె + వితమిన్ E ఆయిల్. పొడి చర్మానికి దీప్తిని ఇచ్చే మిశ్రమం. చెంచా కొబ్బరి నూనెలో 1 చెంచా ఆలివ్ నూనె & 1 విటమిన్ E క్యాప్సూల్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మసాజ్ చేసి, 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, మెరిసే లుక్ ఇస్తుంది.కొబ్బరి నూనె + కాఫీ పొడి,డెడ్ సెల్స్ తొలగించి, చర్మాన్ని మృదువుగా & తేజస్సుగా మార్చేందుక. 1చెంచా కొబ్బరి నూనెలో 1 చెంచా కాఫీ పొడి కలపండి. ముఖంపై మృదువుగా రబ్ చేసి, 5 నిమిషాల తర్వాత కడగండి. ఇది వాడితే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
కొబ్బరి నూనె + తేనె + బాదం పొడి, చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా మార్చేందుకు. 1 చెంచా కొబ్బరి నూనెలో 1 చెంచా తేనె & 1 చెంచా బాదం పొడి కలపండి. ముఖానికి అప్లై చేసి, 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో సహజ మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఈ మిశ్రమాలను మీ చర్మ రకం & అవసరాన్ని బట్టి వాడండి, తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు పొందొచ్చు.