ప్రతి మనిషికి తగినంత నిద్ర తప్పకుండా ఉండాల్సిందే. నిద్ర లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వ్యాపించే అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల తరచుగా ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. నిద్రలేమి సమస్య వల్ల హార్మోన్ సమతుల్యత కూడా పెరుగుతుంది. హార్మోన్ సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి తగినంత నిద్ర మనిషికి అవసరం. తగినంత నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంగా నిద్రలేమి ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

మెదడు పనితీరు తగ్గిపోతుంది. ఫోకస్ చేయలేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు. మూడ్ స్వింగ్స్, ఆంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం. హృదయ సమస్యలు పెరుగుతాయి.హై బీపీ పెరిగే అవకాశం. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం. నిద్రలేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఆకలి ఎక్కువ అవుతుంది.మెటబాలిజం మందగించి ఫ్యాట్ ఎక్కువగా నిల్వ అవుతుంది.డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా దాడికి గురయ్యే అవకాశం. తరచుగా జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు. జీవనశైలి మీద ప్రభావం.పని సామర్థ్యం తగ్గిపోతుంది.

డ్రైవింగ్ లేదా డే-టు-డే యాక్టివిటీల్లో అవగాహన తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం. మూడ్ సరిగ్గా లేక ఇతరులతో అనవసర గొడవలు పడే అవకాశం.పెద్దవాళ్లు (18-60 ఏళ్లు) – రోజుకు 7-9 గంటలు. పిల్లలు (6-12 ఏళ్లు) – రోజుకు 9-12 గంటలు. టీనేజ్ (13-18 ఏళ్లు) – రోజుకు 8-10 గంటలు. వృద్ధులు (60+ ఏళ్లు) – రోజుకు 7-8 గంటలు. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లవడం.పడుకునే 1 గంట ముందు మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించడం. గది చల్లగా, నిశ్శబ్దంగా ఉంచడం. రోజూ వ్యాయామం చేయడం. భారం ఎక్కువగా ఉండే ఆహారం రాత్రి తినకపోవడం. తగినంత నిద్ర తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యము.

మరింత సమాచారం తెలుసుకోండి: