
సమ్మర్ లో తల తిరిగితే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. లెమన్ జ్యూస్ తయారు చేసేటప్పుడు అందులో కాస్త సాల్ట్ వెయ్యాలి. ఉప్పు శట్టిని ఇస్తుంది. అలాగే బొప్పాయి జ్యూస్ తాగితే వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటితో పాటుగా తులసి జ్యూస్ చలి కాలమే కాదు... సమ్మర్ లో కూడా మేలు చేస్తుంది. ఒంట్లో వేడి తగ్గించడానికి సహాయపడే కొన్ని ఉత్తమమైన జ్యూసులు ఇవి. పుచ్చకాయ జ్యూస్,శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడి తగ్గిస్తుంది. సహజంగా చల్లదనాన్ని అందిస్తుంది. నిమ్మరసం,శరీరాన్ని డిటాక్స్ చేసి, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడుతుంది.
బెల్లం జ్యూస్,వేసవిలో ఒంట్లో వేడి తగ్గించేందుకు ఉత్తమమైనది. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. పుదీనా జ్యూస్,సహజ శీతలత కలిగినది. ఒంట్లో వేడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నీరు, డీహైడ్రేషన్ నివారించి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సహజ ఎలక్ట్రోలైట్స్ కలిగి ఉంటుంది. ఖర్బూజ జ్యూస్,ఒంట్లో చల్లదనం కలిగిస్తుంది.నీటి శాతం ఎక్కువగా ఉండే ఫలం. క్యారెట్ జ్యూస, రీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. కీరా జ్యూస్,శరీరాన్ని తేమగా ఉంచుతుంది. ఒంట్లో వేడిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరం.ఈ జ్యూసులను క్రమంగా తాగితే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి, వేడి తగ్గుతుంది. బాగా చల్లని నీటిని ఎక్కువగా తాగడం కూడా సహాయపడుతుంది.