
వ్యాయామం చేసిన తర్వాత లేదా అలసటగా అనిపించినప్పుడు ఇది మంచి టానిక్‌లా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. ఖర్జూరంలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ఇది కడుపు సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. పాలలోని ప్రొబయోటిక్స్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తహీనత తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ D, ఖర్జూరంలో ఉండే ఐరన్ కలిసి బలమైన ఎముకలకూ ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో పొటాషియం మరియు పాలలో క్యాల్షియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె సంబంధిత సమస్యలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఉండటంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, శరీరంలోని బలహీనతను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. బలమైన ఎముకలకు సహాయపడుతుంది.పాలలో కాల్షియం, విటమిన్ D ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఖర్జూరంలో ఉండే మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకల దృఢతను పెంచుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో 2-3 ఖర్జూరాలు కలిపి 5-10 నిమిషాలు మరిగించాలి. తరిగిన ఖర్జూరాలు పాలలో కలిపి తాగవచ్చు లేదా నానబెట్టి మిక్సీ పెట్టి తాగొచ్చు. మంచి ఫలితాల కోసం రాత్రి నిద్రకు 30 నిమిషాలు ముందు తాగాలి.