
వాము టీ తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లి లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వాములో ఉండే నేచురల్ సెడేటివ్ లక్షణాలు మైండ్ రిలాక్స్ చేస్తాయి. ఒత్తిడి, టెన్షన్, మానసిక ఆందోళన తగ్గిస్తుంది. గొంతు & దగ్గుకు మంచి ఔషధం. గొంతు ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే వాము టీ తాగితే ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వాము టీ మెటాబాలిజాన్ని పెంచి, కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. కడుపులో ఉబ్బరం తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. హాయిగా నిద్ర పడేలా చేస్తుంది.
కడుపులో కొవ్వు తగ్గించేందుకు ఇది బాగా పనిచేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో PCOS, మాసిక రుతువుకు సంబంధించిన సమస్యలలో ఉపశమనం ఇస్తుంది. గర్భిణీలు తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. 1 గ్లాస్ నీటిని కాచి, 1 టీ స్పూన్ వామును వేయాలి. 5-10 నిమిషాలు మరిగించాలి. రుచికి తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి. రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు తాగితే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.మీరు వాము టీ తాగి ఎలాంటి ప్రయోజనాలు అనుభవించారు? కామెంట్ చేయండి.