
అనే యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించి, గుండె సురక్షితంగా పనిచేసేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ధమనుల నాడిని శుభ్రం చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఇన్‌సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచే పోషకాలతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మితంగా తాగితే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రొబయోటిక్ గుణాలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి, ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.
అనే యాంటీఆక్సిడెంట్ మెదడు కణాలను రక్షించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేస్తుంది. ఆల్జైమర్ & డిమెన్షియా వంటి మెదడు వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడులో రక్త ప్రసరణ మెరుగుపరిచి, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. చర్మానికి సహజమైన గ్లో ఇస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చర్మాన్ని మెరుగు పరుస్తుంది. మొటిమలు, చర్మ ముడతలు, గోధుమ రంగు తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మానికి తేమను అందించి, సాఫ్ట్‌గా & బ్రైట్‌గా ఉంచుతుంది. ద్రాక్ష నీరు సహజమైన డిటాక్సిఫయింగ్ డ్రింక్. మూత్రపిండాల్లో టాక్సిన్లను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. లివర్ పనితీరును మెరుగుపరిచి, ఫ్యాటీ లివర్ రోగం ముప్పును తగ్గిస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండటంతో ఎముకల బలాన్ని పెంచుతుంది. వయసుతో వచ్చే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.