పిల్లల మెదడు అభివృద్ధి పౌష్టికాహారం, మంచి అలవాట్లు, మెదడు వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇవే. మెదడు ఆరోగ్యానికి మంచి ఆహారం ఇవ్వడం చాలా అవసరం. ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. బాదం, వాల్నట్ – మెదడు శక్తిని పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ఒమేగా-3 అధికంగా ఉంటుంది. అరటి పండు – మెదడుకు తక్షణ శక్తిని అందిస్తుంది. పచ్చి కొబ్బరి & కొబ్బరి నీరు – మెదడు కణాలను ఉల్లాసపరచి చురుకుదనం పెంచుతుంది. ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ – యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దాల్చిన చెక్క, తేనె, అల్లం – మెదడు నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి, ఫోకస్ పెంచుతాయి.

ఉదయం బాదం 4-5, వాల్నట్ 1 నానబెట్టినవీ పిల్లలకు ఇవ్వండి. రోజుకు ఒక అరటి పండు, కొబ్బరి నీరు, తేనె కలిపిన పాలు ఇవ్వడం ఉత్తమం. మెదడు వ్యాయామాలు & గేమ్స్ ఆడించాలి. పిల్లల మెదడును చురుకుగా, సృజనాత్మకంగా ఉంచేందుకు కొన్ని గేమ్స్ & పజిల్స్ ఉపయోగించండి. పిల్లలు కొత్త పదాలను నేర్చుకునేలా కథలు చెప్పండి. మెదడు ఆరోగ్యానికి యోగా & ధ్యానం. రోజూ 10 నిమిషాలు యోగా చేయడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ను మెరుగుపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది. సర్వాంగాసనం – మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.శిర్షాసనం – మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ అందించి, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.

ప్రాణాయామం – ఆలోచనా శక్తిని పెంచి, మెదడు చురుకుగా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం పిల్లలకు 5-10 నిమిషాలు ప్రాణాయామం చేయించండి. భ్రమరి ప్రాణాయామం పిల్లల ఏకాగ్రతకు బాగా ఉపయోగపడుతుంది. కధలు వినిపించడం & పుస్తకాలు చదవించడం. పిల్లలకు మంచి కథలు చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి, ఊహాశక్తి, భాషా పరిజ్ఞానం పెరుగుతుంది.మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే సామర్థ్యం, అవగాహన & ఆలోచనా శక్తి పెరుగుతుంది.రోజూ 15-20 నిమిషాలు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవండి. పిల్లలతో కథలపై చర్చించండి, ఆ కథలోని ముఖ్యమైన విషయాలను వారితో చెప్పించండి. పిల్లల మెదడు అభివృద్ధికి నిద్ర చాలా కీలకం. రాత్రి 8-10 గంటలు నిద్రపోతే మెదడు విశ్రాంతి పొందుతుంది. తక్కువ నిద్రపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి.రాత్రి TV, మొబైల్ స్క్రీన్‌లకు దూరంగా ఉంచండి. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: