సిటీ ఆఫ్ పెర్ల్స్.. హైదరాబాద్ కు ఆ పేరు ఊరికే రాలేదు. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో హాయిగా బతకొచ్చనే పేరున్న ఈ నగరం ఇప్పుడు ఖర్చుల సుడిగుండంలో చిక్కుకుంది. అవును హైదరాబాద్‌లో నెల గడవాలంటే జేబు గుల్ల చేసుకోవాల్సిందే. ఒకప్పుడు 'చలో హైదరాబాద్' అని బ్యాగులు సర్దుకుని వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ బతకడం భారంగా మారుతోంది.

సింగిల్ రూమ్ అద్దెకే 8 వేలుంటే ఇక మిడిల్ క్లాస్ బతుకు బండి ఎలా లాగాలి? ఇల్లు అద్దెలు మండిపోతున్నాయి, నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకా స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు అదనం. మొత్తానికి హైదరాబాద్‌లో ఒక్క మనిషి నెలకు కనీసం 31 వేల 253 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఇన్ఫోసిస్ సంస్థ తాజా సర్వే తేల్చేసింది. షాకింగ్‌గా ఉంది కదూ, అదే ఈ డబ్బులు పల్లెటూర్లో వస్తే కనీసం 15,000 వెనకేయవచ్చు. వాటిని సేవ్ చేసుకుంటే వడ్డీతో కలిపి రెండు లక్షల అవుతాయి. అలా 5 ఏళ్ళు దాచుకున్న రూపాయల్లో మిలియనీర్ అవ్వచ్చు.

అదే హైదరాబాదులో బతికితే రెంటల్ యజమానులు కోటీశ్వరులను చేసినట్లు అవుతుంది. దేశంలోని టాప్ 10 నగరాల్లో ఈ సర్వే చేస్తే లివింగ్ కాస్ట్ విషయంలో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. చాలామంది లక్షలాది మంది జనం ఇక్కడ నెలకు కేవలం 15 వేల రూపాయలతోనే నెట్టుకొస్తున్నారు. వాళ్ల బతుకులు ఎంత కష్టంగా ఉంటాయో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.

దేశంలోనే అత్యంత కాస్ట్లీ సిటీ బెంగళూరు అయితే.. ఖర్చుల విషయంలో కాస్త ఊరటనిచ్చే నగరం జైపూర్ అని సర్వే రిపోర్ట్ వెల్లడించింది. మొత్తానికి హైదరాబాద్‌లో బతకాలంటే బాగా డబ్బులుంటేనే బెటర్ లేకపోతే బతుకు బండి లాగడం కష్టమే. ఈ సమాచారం ఇన్ఫోసిస్ సంస్థ సర్వే రిపోర్ట్ ఆధారంగా రాయబడింది. ఏది ఏమైనా మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే తప్ప హైదరాబాద్ వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: