
ఏప్రిల్ నెల మొత్తం మీద 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. జాతకాలు, గ్రహ స్థితులు, గోచారాలు, తారాబలం, వధూవరుల గణన, రాశి ఫలాల పొంతన, ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది. మీ ఇంటిలో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్రిల్ నెలలో కచ్చితంగా మంచి ముహూర్తం కుదురుతుంది. ఇన్ని ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్ అవుతుంది. ఏప్రిల్ నెలలో 13 వ తేదీ వరకు మూఢం ఉంది. దీంతో పాటు సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల 13 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. అంటే ఏప్రిల్ నెలలో సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. నెల సగం అయిన తర్వాత నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి.
పెళ్లి ముహూర్తాలు ఉన్న తేదీలు..
మార్చి 30న ఉగాది కావున అప్పటి నుంచి కొత్త సంవత్సరమైన విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం, బహూళ పక్షం పాడ్యమి తిధి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి.
ఏప్రిల్ 14(పాడ్యమి), ఏప్రిల్ 16(తదియ), ఏప్రిల్ 18(పంచమి), ఏప్రిల్ 19(షష్టి), ఏప్రిల్ 20(సప్తమి, అష్టమి), ఏప్రిల్ 21(అష్టమి, నవమి), ఏప్రిల్ 25(ద్వాదశి), ఏప్రిల్ 29 (శుక్ల విదియ), ఏప్రిల్ 30(శుక్ల తదియ). ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఈ తిథుల్లో ఏ నక్షత్రానికి మంచి ముహూర్తం సెట్ అవుతుందో మీకు దగ్గర్లో ఉన్న ఆలయంలో పండితులను అడిగి ముహూర్తం పెట్టించుకోండి.